News

బతకమ్మ ఉత్సవాలకు లోగో సిద్దం


దసరాను పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన బతకమ్మ ఉత్సవాలకు గాను లోగోను కూడా తయారు చేసింది సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిని తయారు చేశారు. మహిళల సాధికారిత, పిల్లల సంరక్షణ,ప్రకృతి ఆరాదన, చెరువుల పరిరక్షణ ధీమ్ లతో దీనిని రూపొందించామని ఆయన తెలిపారు. తెలంగాణ జీవన విదానానికి బతకమ్మ ప్రతీక వంటిదని ఈ సందర్భంగా వెంకటేశం వ్యాఖ్యానించారు. బతకమ్మ ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని డిల్లీలో కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.